సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండల కేంద్రంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శిఖర ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శిఖర ప్రతిష్ట మహోత్సవం మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఈ మహోత్సవంలో భాగంగా విశ్వేశ్వర పూజ, పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన, ప్రధాన కలశాధారణ, జలాధివాసం, దాన్యాధివాసం, మూలమంత్ర హోమం వంటి పలు కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు రాజశేఖర్ శర్మ ఆధ్వర్యంలో అర్చక బృందం సభ్యులు ఎంతో నిష్టతో శిఖర ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు దంపతులు పీఠాలపై కూర్చుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాల స్వీకరణతో కార్యక్రమాలు ముగిశాయి.

