కిష్టాపూర్ (ధర్మ రథం) ఆగస్టు 29
కిష్టాపూర్ గ్రామంలో శ్రావణమాసం పురస్కరించుకుని హనుమాన్ మందిర్ వద్ద పెద్ద ఎత్తున అన్నదానం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కిష్టాపూర్ గ్రామంలో శ్రావణమాసం సందర్భంగా హనుమాన్ మందిర్ వద్ద పెద్ద మొత్తంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మానెవ్వ గంగొండ, మాజీ ఎంపీటీసీ అంజయ్య, శ్రీను పటేల్, పుల్లేని పీరయ్య, మాజీ సర్పంచ్ సాయిలు, మంద గంగాధర్, వార్డ్ మెంబెర్ పర్సు బీరప్ప, వడ్ల సాయిలు, చందూగౌడ్ కాశిరం, శివతో పాటు గ్రామ యువకులు, ప్రజలు పాల్గొన్నారు.












