రాజన్న సిరిసిల్ల, 2026-08-21
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ప్రతి సంవత్సరం శ్రావణమాసం సందర్భంగా నిర్వహించే సూరమ్మతల్లి వనభోజన మహోత్సవం ఈ ఏడాది కూడా వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ప్రతి సంవత్సరం శ్రావణమాసం సందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని గ్రామస్తులందరూ సూరమ్మ దేవతకు వనభోజనాల పేరిట ఉత్సవం నిర్వహించి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ ఏడాది కూడా ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా చల్మెడ లక్ష్మీనరసింహారావు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు హాజరయ్యారు. ఆయన ముందుగా బుగ్గా రాజేశ్వర స్వామి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సూరమ్మ తల్లి వనభోజన కార్యక్రమంలో పాల్గొని అందరికీ అమ్మవారి నైవేద్యాన్ని, ప్రసాదాన్ని అందించారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారామ్, సీనియర్ నాయకులు గంగం మహేష్, మంచె రాజేశం, కంటె రెడ్డి, దయ్యాల కమలాకర్, మాడిశెట్టి కృపాల్, ఉప్పులూటి గణేష్, చంద్రయ్య, తర్రే గంగా రెడ్డి, అల్లూరు గంగారెడ్డి, దుబ్బ రవీందర్, ఆకుల గంగాధర్, జోగినిపల్లి గంగాధర్, ఏనుగు రాజు, తర్రే నరేందర్ తదితరులు పాల్గొన్నారు.












