పెద్దకోడెపాక (ధర్మ రథం) సెప్టెంబర్ 02
గ్రామంలో కురుమ కులస్తులు ప్రతి ఏటా శ్రావణ మాసంలో నిర్వహించుకునే పోచమ్మ తల్లి బోనాల పండుగను ఈరోజు అంగరంగ వైభవంగా జరిపారు. డోలు వాయిద్యాల నడుమ భక్తులు బోనాలతో ఊరేగింపుగా తరలిరాగా, పోతరాజు విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
పెద్దకోడెపాకలో అంగరంగ వైభవంగా పోచమ్మ తల్లి బోనాల పండుగ పెద్దకోడెపాక గ్రామంలోని కురుమ కులస్తులు శ్రావణ మాసంలో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పోచమ్మ తల్లి బోనాల పండుగను ఈరోజు అంగరంగ వైభవంగా నిర్వహించారు. డోలు వాయిద్యాల నడుమ భక్తులు బోనాలతో ఊరేగింపుగా తరలివెళ్లగా, పోతరాజు విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం పోచమ్మ తల్లి అమ్మవారి చెంతకు చేరుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అమ్మవారికి మొక్కుబడిగా గొర్రె పొట్టేలు, కోళ్లు సమర్పించి, నైవేద్యం పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని పోచమ్మ తల్లిని భక్తులు ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దమనిషి అమ్మరాజు, ఆలయ చైర్మన్ ముజిగిరి వేణు సామాజిక సేవకుడు అమ్మ అశోక్,అన్న మహేందర్ తో పాటు గ్రామ పెద్దలు, కురుమ కులస్తులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు. 🙏 పోచమ్మ తల్లి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ… 🙏 జై పోచమ్మ తల్లి!












