ఆధ్వర్యం (ధర్మ రథం) సెప్టెంబర్ 02
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను కోరుట్ల నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, అనంతరం కేక్ కట్ చేశారు.
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలను కోరుట్ల నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుట్లలోని అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఆ తర్వాత నంది చౌరస్తాలో కేక్ కటింగ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వోడ్నాల రామారావు (మాజీ కోరుట్ల నియోజకవర్గం పిఓసి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీనియర్ నాయకులు), వీర మహిళ వోడ్నాల సౌజన్య (హడక్ కమిటీ సభ్యురాలు), మాసం విజయ్ కుమార్, దాసోహం అనిల్, కట్టా రంజిత్, తుమ్మ సురేష్, కోటగిరి సంపత్, ఉష కొల్ల, శశి ప్రణీత్, సంజీవ్ రాకేష్, రాజు గణేష్, నరహరితో పాటు జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన దీర్ఘాయుష్షుతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.










