వందేమాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకల ముగింపు వారంలో భాగంగా శనివారం రాయికల్లోని ప్రగతి హైస్కూల్ ఐఐటీ అకాడమీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన వందేమాతరం గేయాన్ని సామూహికంగా ఆలపించారు.
వందేమాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకల ముగింపు వారంలో భాగంగా శనివారం రాయికల్లోని ప్రగతి హైస్కూల్ ఐఐటీ అకాడమీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన వందేమాతరం గేయాన్ని సామూహికంగా ఆలపించారు. పాఠశాల ప్రిన్సిపాల్ బాలె శేఖర్ మాట్లాడుతూ.. వందేమాతరం గేయం భారతీయుల్లో దేశభక్తి, జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించిందన్నారు. స్వాతంత్ర్య పోరాట కాలంలో ఈ గేయం ప్రజల్లో స్ఫూర్తిని నింపిందని పేర్కొన్నారు.
విద్యార్థులు దేశ చరిత్ర, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను తెలుసుకోవడంతో పాటు దేశం పట్ల గౌరవం, బాధ్యత కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ నిఖిల్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.


