Jagtial/Raikal (ధర్మ రథం) సెప్టెంబర్ 05
జగిత్యాల పద్మశాలి సంఘం మరియు (పద్మశాలి ఆఫీసర్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్) సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు.
పద్మశాలి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన ఎమ్మెల్సీ ఎల్ రమణ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జగిత్యాల పద్మశాలి POPA ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం సమాజ నిర్మాణంలో, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు పోషిస్తున్న పాత్ర అత్యంత కీలకమైనదని ఎమ్మెల్సీ ఎల్. రమణ అన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల పద్మశాలి సంఘం మరియు POPA (పద్మశాలి ఆఫీసర్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు గ్రహించిన పలువురు ఉపాధ్యాయులను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎల్. రమణ మాట్లాడుతూ... డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవం నాడు గురువులను గౌరవించుకోవడం శుభ పరిణామమని పేర్కొన్నారు. విద్యా రంగానికి ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలను గుర్తించి సన్మానించడం సమాజ బాధ్యత అని చెప్పారు. పద్మశాలి సంఘం మరియు POPA సంస్థలు విద్యా, సామాజిక రంగాల్లో ముందంజలో ఉంటూ ప్రతిభావంతులను ప్రోత్సహించడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను శాలువాలతో ఘనంగా సత్కరించి, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రతినిధులు, POPA బాధ్యులు, ఉపాధ్యాయులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు..












