మండలం అల్లీపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జగిత్యాల పట్టణానికి చెందిన చర్మ వ్యాధుల నిపుణులు డా. యెనుగందుల నరేశ్, గైనకాలజిస్ట్ శుభాంగి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో సుమారు 200 మంది ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
అల్లీపూర్ తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. డా. నరేశ్ చర్మ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రత పాటించాల్సిన విధానం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.
నిరుపేదలకు ఉచిత మందులు
చర్మ సమస్యలతో బాధపడే నిరుపేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డ్ మెంబెర్ అనుమల్ల రాజ్ కుమార్, ఎలిగేటి మనోజ్, మ్యాకల రాజాశేఖర్, వేముల సతీష్, పొట్టవత్తిని నాగభూషణం, మోర శివ, అనుమల్ల మల్లేశం, రాజేందర్, సిరిపురం ఆనంద్, మిట్టపెల్లి దామోదర్, రాచర్ల శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.












