జగిత్యాల పద్మనాయక ఫంక్షన్ హాల్ లో వెలమ సంక్షేమ మండలి, సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ సంయుక్తంగా ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభమైంది. ఈ శిబిరాన్ని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు.
జగిత్యాల: వెలమ సంక్షేమ మండలి, జగిత్యాల ఆధ్వర్యంలో, సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జగిత్యాల పద్మనాయక ఫంక్షన్ హాల్ లో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్ ప్రతినిధి సురేందర్ రావు, కేడీసీసీ జిల్లా సభ్యులు రామచందర్ రావు, వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సాగర్ రావు, ప్రధాన కార్యదర్శి వేణు గోపాల్ రావు, పాక్స్ చైర్మన్లు దామోదర్ రావు, సందీప్ రావు, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, మాజీ అధ్యక్షులు పురుషోత్తం రావు, కౌన్సిలర్ దుమాల రాజ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ పెండెం రాములు, బాల ముకుందం, శరత్ రావు, ములసపు మహేష్, ప్రవీణ్ రావు, కార్యవర్గ సభ్యులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.












