ధర్మారం (ధర్మ రథం) ఆగస్టు 19
రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఏంజెలా ఆల్ఫ్రెడ్ బుధవారం కోనరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ధర్మారం సబ్ సెంటర్లో నిర్వహించిన యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ () సెషన్‌ను పర్యవేక్షించారు.

పరిశీలించిన అంశాలు
ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలు తీరు, చిన్నారులకు అందిస్తున్న టీకాలు, టీకాల నిల్వ మరియు నిర్వహణ, టీకాల రికార్డుల నిర్వహణ తదితర అంశాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి () పరిశీలించారు. అర్హులైన ప్రతి చిన్నారికి నిర్ణీత షెడ్యూల్ ప్రకారం అన్ని టీకాలు అందేలా సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆమె సూచించారు.
అవగాహన కల్పించాలని సూచన
అలాగే, టీకాల ప్రాధాన్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, టీకాలు వేయించుకోవడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ప్రజలను చైతన్యపరచాలని ఆమె సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో టీకాల కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అధికారి డా. సంపత్ కుమార్, నవీన, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.