మెట్పల్లి, 2 September
మెట్పల్లి పట్టణంలో ఈఎన్టీ స్పెషలిస్ట్‌గా చలామణి అవుతున్న అర్హత లేని వైద్యుడికి జగిత్యాల జిల్లా ఉప వైద్య మరియు ఆరోగ్య అధికారి (డిప్యూటీ డీఎంహెచ్ఓ) డా. ముస్కు జైపాల్ రెడ్డి షోకాజ్ నోటీసు జారీ చేశారు. సూర్య హాస్పిటల్లో అనర్హుడు వైద్య సేవలు అందిస్తున్నాడని అందిన ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.
జగిత్యాల జిల్లా:*మెట్పల్లిలో ఈఎన్టీ స్పెషలిస్ట్‌గా చలామణి అవుతున్న అర్హత లేని వైద్యునికి షోకాజ్ నోటీసు జారీ చేసిన జగిత్యాల జిల్లా ఉప వైద్య అధికారి డా జైపాల్ రెడ్డి*
మెట్పల్లి పట్టణంలో జగిత్యాల జిల్లా ఉప వైద్య మరియు ఆరోగ్య అధికారి (డిప్యూటీ డీఎంహెచ్ఓ) డా. ముస్కు జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
సూర్య హాస్పిటల్లో అర్హత లేని (Unqualified) వైద్యుడు ఈఎన్టీ స్పెషలిస్ట్‌గా వైద్య సేవలు అందిస్తున్నారనే ఫిర్యాదుల మేరకు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా సంబంధిత వైద్యుల విద్యార్హతలు, వైద్య మండలి నమోదు (Registration) వివరాలు, ఆసుపత్రి రికార్డులు మరియు ఇతర పత్రాలను పరిశీలించారు.
తనిఖీలో ప్రాథమికంగా గుర్తించిన అంశాల ఆధారంగా సూర్య హాస్పిటల్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేయబడింది. నిర్ణీత గడువులోగా వివరణ సమర్పించాలని ఆదేశించారు. అనంతరం అందిన వివరణను పరిశీలించి, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం మరియు ఇతర వర్తించే నిబంధనల ప్రకారం తగిన చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్ఓ తెలిపారు.
అనంతరం మెట్పల్లి పట్టణంలోని ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం అమలును పరిశీలించారు. ఆసుపత్రులు తప్పనిసరిగా నమోదిత, అర్హత కలిగిన వైద్యుల ద్వారానే వైద్య సేవలు అందించాలని, చట్ట నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డా. ముస్కు జైపాల్ రెడ్డి హెచ్చరించారు.
ప్రజలు అర్హత కలిగిన, నమోదిత వైద్యుల వద్ద మాత్రమే చికిత్స పొందాలని, అనుమానాస్పద వైద్య సేవలపై ఆరోగ్య శాఖకు సమాచారం అందించాలని కోరారు.












