భైంసా పట్టణంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. నిమజ్జనానికి వెళ్లే విగ్రహాలు, నిమజ్జనం అనంతరం తిరుగు ప్రయాణం చేసే వాహనాల కోసం వేర్వేరు మార్గాలను కేటాయించారు. ప్రజలు, వాహనదారులు ఈ సూచనలను పాటించాలని కోరారు.
మండలం నుంచి, రాపర్తి నగర్, బీసీ కాలనీ, కూరగాయల మార్కెట్, ఆర్ఆర్ స్కూల్ ఏరియా, కొత్త బస్టాండ్ ఏరియా, సాయిబాబా ఆర్చ్, ఆర్టీఏ ఆఫీస్ ఏరియా, బ్యాంక్ కాలనీ, వికలాంగుల కాలనీ, బల్లేపల్లి, ఖానాపురం టేకులపల్లి, న్యూ విజన్ కాలేజ్ పైపు నుండి వచ్చే గణేష్ విగ్రహాలు బైపాస్ ద్వారా ఎన్టీఆర్ సర్కిల్ కి చేరుకొని, అక్కడి నుండి ఇల్లందు ఎక్స్ రోడ్, గవర్నమెంట్ హాస్పిటల్, జడ్పీ సెంటర్, చెరువు బజార్, బోనకల్ ఎక్స్ రోడ్, చర్చి కాంపౌండ్, ముస్తాఫ్ నగర్, సంబానినగర్, రాఘవ మెడికల్స్, శ్రీరామ్ హిల్స్, దంసలాపురం చెరువుకి వెళ్లేదారి గుండా నిమజ్జనం పాయింట్ కి చేరుకోవాలి.
పంపింగ్ వెల్ రోడ్, గాంధీనగర్, మోతీనగర్, పిఎస్ఆర్ రోడ్, గాంధీచౌక్, సారధినగర్, బొక్కలగడ్డ నుండి వచ్చే వాహనాలు నయాబజార్ నుండి జూబ్లీ క్లబ్, మయూరి సెంటర్, మామిళ్లగూడెం, బురాన్ పురం, బస్ డిపో ఏరియా, కమాన్ బజార్, కస్బా బజార్ నుండి వచ్చే వాహనాలు కిన్నెరసెంటర్, జడ్పీ సెంటర్, చెరువు బజార్, చర్చి కాంపౌండ్ మీదుగా నిమజ్జనం పాయింట్ కు చేరుకోవాలి.
శ్రీ శ్రీ సర్కిల్, శ్రీ నగర్ కాలనీ, రోటరీ నగర్, ఇందిరానగర్, పాత మమతా మెడికల్ కాలేజీ, మమత ఎక్స్ రోడ్, కవి రాజు నగర్, పాత కలెక్టరేట్ బ్యాక్ గల విగ్రహాలు, గట్టయ్య సెంటర్, బ్యాంక్ కాలనీ, వీడియోస్ కాలనీ నుండి వచ్చే వాహనాలు ఇల్లందు ఎక్స్ రోడ్డు నుండి జడ్పీ కి చేరుకొని చర్చి కాంపౌండ్ ద్వారా నిమజ్జనం పాయింట్ కి చేరుకోవాలి.
వెంకటగిరి ఎక్స్ రోడ్, శ్రీనివాస నగర్, గ్రేయిన్ మార్కెట్ ఏరియా, ప్రకాష్ నగర్, గుట్టల బజార్, జహీర్ పుర తండా, అయ్యప్ప స్వామి టెంపుల్ ఏరియా విగ్రహాలు మొత్తం మెయిన్ రోడ్డు ద్వారా చర్చి కాంపౌండ్ కి చేరుకొని అక్కడి నుండి నిమజ్జనం పాయింట్ కి చేరుకోవాలి.
గొల్లగూడెం, మధురానగర్, రాఘవయ్య నగర్, మమతా కాలేజ్, హార్వెస్ట్ స్కూల్ ఏరియా, అల్లిపురం, కొత్తగూడెం, అల్లిపురం ఎక్స్ రోడ్డు నుండి వచ్చే విగ్రహాలు టాటా మోటార్స్ ద్వారా చెరువు బజార్, చర్చి కాంపౌండ్ ద్వారా నిమజ్జనం పాయింట్ కు చేరుకోవాలి.
బోనకల్ ఎక్స్ రోడ్, చర్చి కాంపౌండ్, పోలీస్ హెడ్ క్వార్టర్స్, మిషన్ హాస్పిటల్ ఏరియా, ముస్తఫా నగర్, సంబాని నగర్, పరికముక్కల కాలనీ, శ్రీరామ్ నగర్, శ్రీరామ్ హిల్స్ నుండి వచ్చే విగ్రహాలు మెయిన్ రోడ్డు ఎక్కి నిమజ్జనం పాయింట్ కు చేరుకోవాలి.
తిరుగు ప్రయాణ మార్గాలు
నిమజ్జనం అనంతరం ప్రజలు, వాహనాలు నిమజ్జనం పాయింట్ నుండి జయశంకర్ విగ్రహం వరకు చేరుకొని, ప్రకాష్ నగర్, శ్రీనివాస్ నగర్, జహీర్ పుర తండా, అయ్యప్ప టెంపుల్, వెంకటగిరి ఎక్స్ రోడ్ వైపు వెళ్లేవారు దంసలాపురం బ్రిడ్జిని దాటి, బ్రిడ్జి కింది నుండి దంసలాపురం ఊరిలో నుండి ఎస్వీఎం స్కూల్ గుండా శ్రీనివాస నగర్, అయ్యప్ప టెంపుల్, ప్రకాష్ నగర్ వైపు వెళ్లి మెయిన్ రోడ్డు ద్వారా వారి గమ్యస్థానాలకు వెళ్ళవచ్చును.












