గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించి, తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జగ్గుతండాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గురువారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ చేసిన కృషిని వారు కొనియాడారు.
జగ్గుతండా గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో వంతడుపుల మాజీ ఎంపీటీసీ అజ్మీరా లింగ్యా నాయక్ ఆధ్వర్యంలో పలువురు మాజీ, ప్రస్తుత ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
గిరిజనుల అభివృద్ధికి కేసీఆర్ కృషి
కేసీఆర్ గిరిజనుల అభివృద్ధి, తండాల అభ్యున్నతికి చేసిన కృషిని నాయకులు, కార్యకర్తలు కొనియాడారు. తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడం ద్వారా గిరిజన ప్రాంతాలకు స్థానిక పరిపాలనలో ప్రాధాన్యత లభించిందని వారు పేర్కొన్నారు.
కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు అజ్మీరా మల్సోర్, మలోత్ ఎలుము, బానోతు వెంకన్న, ప్రస్తుత వార్డు సభ్యులు మంగ-స్వామి నాయక్, మాజీ ఉపసర్పంచ్ అజ్మీరా సరోజ-రంగ నాయక్, వాట్స సభ్యుడు, బీఆర్ఎస్ కార్యకర్తలు బానోతు లక్పతి, తరుణ్, మంగు, చిక్క, మంగీలాల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.











