మధిర, 27 September
హైదరాబాద్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోని పలు హోటళ్లలో టీజీ సేఫ్ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. నాసిరకం ఆహారం, ఈగలు, బొద్దింకలు వంటి అపరిశుభ్రతను గుర్తించిన అధికారులు, వెంటనే పదకొండు ప్రముఖ హోటళ్ల ఫుడ్ లైసెన్స్‌లను రద్దు చేశారు.
హైదరాబాద్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోని పలు హోటళ్లలో టీజీ సేఫ్ అధికారులు సోదాలు నిర్వహించారు. నాసిరకం ఆహారం, ఈగలు, బొద్దింకలు గుర్తించిన నేపథ్యంలో పదకొండు ప్రముఖ హోటళ్ల ఫుడ్ లైసెన్స్‌లను రద్దు చేశారు.
రద్దు అయిన హోటళ్లు
హైటెక్‌సిటీ పరిధిలోని మొనాస్ట్రీ, కోల్ స్పార్క్ రెస్టారెంట్, కాంచి కేఫ్‌ల లైసెన్సులు రద్దు అయ్యాయి. గచ్చిబౌలిలోని శివాణి బార్ అండ్ రెస్టారెంట్, అల్సబా రెస్టారెంట్, ఉడిపీస్ ఉపహార్, అంటెరా కిచెన్ అండ్ బార్లకు సంబంధించిన లైసెన్సులను కూడా రద్దు చేశారు. మాదాపూర్‌లోని లక్కీ రెస్టారెంట్, సాయిరామ్ మెస్, ఇనార్బిట్ మాల్లోని అమ్ ఆహా తెలుగు కిచెన్ అండ్ బార్, మాదాపూర్ ఇనార్బిట్ మాల్లోని ఫ్యూజన్9 మరియు అమ్నీషియా స్కై బార్లకు సంబంధించిన లైసెన్సులను కూడా అధికారులు రద్దు చేశారు.


