Jagtial/Jagityal Rural (ధర్మ రథం) సెప్టెంబర్ 24
పాకిస్తాన్లో ఒక వ్యక్తి తన తల్లి కోరిక మేరకు ఇంటిని ఒక అందమైన ఉద్యనవనంగా మార్చి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. 2016లో కొద్ది మొక్కలతో ప్రారంభించి, ప్రస్తుతం 5,700 మొక్కలతో తన ఇంటిని పచ్చదనంతో నింపేశాడు. ఈ వినూత్న ప్రయత్నం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది.
సాధారణంగా ఇంటి చుట్టూ ఒకటి రెండు మొక్కలు పెంచుకోవడం చూస్తుంటాము. కానీ పాకిస్తాన్లో ఒక వ్యక్తి తన ఇంటిని ఉద్యనవనంగా మార్చి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తల్లి ఇంట్లో మొక్కలు పెంచాలని కోరడంతో, అతను ఈ వినూత్న పనికి శ్రీకారం చుట్టాడు.
2016లో కొన్ని మొక్కలతో ప్రారంభించి, ప్రస్తుతం 5,700 మొక్కలతో విస్తరించింది. ఇంటి గోడలు, బాల్కనీ, ప్రాంగణం, పైకప్పు, మెట్లు.. ఇలా ఇంటినిండా చెట్లు నాటాడు. ఇక్కడితో ఆగకుండా, ఇంకా పదివేల మొక్కల వరకు నాటుతానని అతను అంటున్నాడు.
ఈ ఇంటిని చూసేందుకు దేశం నలుమూలల నుండి ప్రజలు వస్తున్నారని అతను తెలిపాడు. ఈ మొక్కల కోసం 20 లక్షలు ఖర్చు చేసినట్లు అతను చెప్పాడు. ప్రతినెలా వీటి నిర్వహణకు 30 వేలు ఖర్చవుతున్నాయని అతను అన్నాడు. బీబీసీ ఈ ఇంటి గురించి కథనం ప్రసారం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం లభించింది. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.












