రంగారెడ్డి, 12 September
తెలంగాణ విమోచన కోసం ప్రాణత్యాగం చేసిన 12 మందికి ఘనంగా నివాళులర్పించిన నాయకులు
అప్పంపల్లి అమరవీరులకు ఘన నివాళులు తెలంగాణ విమోచన కోసం ప్రాణత్యాగం చేసిన 12 మంది అమరవీరులకు నివాళులు పాలమూరు పార్లమెంట్ పరిధిలోని అప్పంపల్లి గ్రామంలో తెలంగాణ విమోచన కోసం ప్రాణత్యాగం చేసిన 12 మంది అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అప్పంపల్లి గ్రామంలోని అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు కంచుకోట మహేష్, పవన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. తెలంగాణ విమోచన కోసం అప్పటి పరిస్థితుల్లో ధైర్యంగా పోరాడి తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరుల సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. వారి త్యాగాల స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం వారికి ఘనంగా నివాళులు అర్పించడం ద్వారా వారి పోరాట చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.








