ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, కృష్ణాపురం గ్రామ మాజీ సర్పంచ్ కర్నాటి రామారావుకు ఆయన చిన్ననాటి స్నేహితులు, గ్రామస్తులు ఘనంగా అభినందనలు తెలిపారు. రాజకీయ, సామాజిక రంగాల్లో ఆయన అందిస్తున్న సేవలను స్నేహితులు కొనియాడారు.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, కృష్ణాపురం గ్రామ మాజీ సర్పంచ్ కర్నాటి రామారావును ఆయన చిన్ననాటి స్నేహితులు, గ్రామస్తులు ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా స్నేహితులు మాట్లాడుతూ, చిన్ననాటి నుంచి తమతో కలిసి మెలిసి ఉన్న కర్నాటి రామారావు రాజకీయ, సామాజిక రంగాల్లో ప్రజలకు అందిస్తున్న సేవలను కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ, మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని శుభాకాంక్షలు తెలిపారు. స్నేహితులు, గ్రామస్తుల అభినందనలకు కర్నాటి రామారావు కృతజ్ఞతలు తెలిపారు.
చిన్ననాటి స్నేహితులు ఇప్పటికీ తనను ఆత్మీయంగా అభినందించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు, గ్రామానికి సేవ చేసే అవకాశం కల్పించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు కర్నాటి రామారావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లపు శేఖర్, బుర్రి నాగరాజు, బుర్రి రవి, మధు తదితరులు పాల్గొన్నారు.











