రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి సిరిసిల్లలోని మానేరు తీరం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గితె బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ, నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తి శ్రద్ధలతో వైభవంగా తరలించాలని సూచించారు.
సిరిసిల్లలోని మానేరు తీరంలో వినాయక నిమజ్జన వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గితె పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి సిరిసిల్లలోని మానేరు తీరం వద్ద (ప్రేమ్ నగర్, బ్రిడ్జి వద్ద) జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గితె పలు శాఖల అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ, వినాయక మండపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తి శ్రద్ధలతో వైభవంగా తరలించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలని కోరారు.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగి, వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వినాయక నిమజ్జనానికి అవసరమైన నీటి సౌకర్యం, స్టేజ్, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, వైద్య, అగ్నిమాపక శాఖల అధికారులు సేవలు అందించాలని, పారిశుధ్య పనులు చేపట్టాలని, క్రేన్లు అందుబాటులో ఉంచాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, ఆర్డీఓ శ్రీధర్ బాబు, డీఎస్పీ నాగేంద్రాచారి, నీటి పారుదల శాఖ అధికారి దయాకర్, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, పోలీసులు పాల్గొన్నారు.








