తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) చిరంజీవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) చిరంజీవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజా పాలన దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో సుష్మ, ఏపీవో దివ్య, మండల ప్రజా పరిషత్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జెండాకు వందనం సమర్పించారు.







