రాజన్న సిరిసిల్ల జిల్లా మండలం పోతుగల్ గ్రామంలో కు ముదిరాజ్ యువసేన యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రుల సందర్భంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ జ్యోతి మేడం హాజరై అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం కు ముదిరాజ్ యువసేన యూత్ సభ్యులు ఎస్ఐ జ్యోతి మేడమ్‌ను ఘనంగా సన్మానించి, సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ నాయకులు, యువజన సభ్యులు చికోటి మహేష్, గీస శంకర్, గీస చంద్రం, గీస రాజయ్య, గీస శ్రీనివాస్, నాంపెల్లి రమేష్, కంచం రవి, కంచం కుమార్, మామిండ్ల ఆంజనేయులు, మామిండ్ల రాణి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


