జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మహదేవపురం విద్యార్థులకు విశ్రాంత గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ పి వి ఎల్ డి ప్రసాద్ స్వంత ఖర్చులతో 6000 రూపాయల విలువైన క్రీడా దుస్తులను అందజేశారు. ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు సిహెచ్ సాధు సమాధానం ఈ దుస్తులను విద్యార్థులకు బహుకరించారు.
మండలంలో జరుగుతున్న మండల స్థాయి క్రీడలకు వెళ్తున్న సందర్భంగా విద్యార్థులకు ఈ క్రీడా దుస్తులను అందజేశారు. ఉద్యోగ విరమణ పొందినప్పటికీ, పాఠశాల విద్యార్థుల పట్ల అభిమానంతో శ్రీ పి వి ఎల్ డి ప్రసాద్ ఈ సహాయం చేశారని ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు సిహెచ్ సాధు సమాధానం తెలిపారు.
ఉపాధ్యాయుల కృతజ్ఞతలు
పాఠశాల పట్ల శ్రీ పి వి ఎల్ డి ప్రసాద్ కు ఉన్న అభిమానానికి ఉపాధ్యాయ బృందం కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు డి వెంకటేశ్వరరావు, తాళ్లూరి సుబ్బారావు, పోలె సుధాకర్, ఎం కృష్ణవేణి, వి ఎల్ పి కుమారి, ఏ వినోద్ రావు, వి. రాములు, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ కె. వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.


