సూర్యాపేట జిల్లా, హుజూర్నగర్ పట్టణంలో జరిగిన జన విజ్ఞాన వేదిక 6వ జిల్లా మహాసభల్లో ఏనుగుల వీరాంజనేయులు జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా రెండవసారి ఎన్నికయ్యారు. మండలం రామాపురం గ్రామానికి చెందిన వీరాంజనేయులు ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు.
సూర్యాపేట జిల్లా, హుజూర్నగర్ పట్టణంలో జరిగిన జన విజ్ఞాన వేదిక 6వ జిల్లా మహాసభల అనంతరం నూతన కమిటీ ఎన్నికైంది. ఈ సందర్భంగా మండలం రామాపురం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేస్తున్న ఏనుగుల వీరాంజనేయులు సూర్యాపేట జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా రెండవసారి తిరిగి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ, సైన్స్ ప్రచారం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం దూసుకుపోతున్నప్పటికీ నేటికీ మూఢనమ్మకాలు పెరిగిపోతున్నాయని అన్నారు. సైన్స్ పై అవగాహన కల్పిస్తూ, మూఢనమ్మకాలపై పోరాటాలు నిర్వహిస్తూ జన విజ్ఞాన వేదిక అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.












