కోదాడకు చెందిన విశ్రాంత గిరిజన గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ శ్రీరామ కవచం శ్రీనివాస కుమార్ ఆదివారం గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. ఆయన మృతి వారి కుటుంబానికి తీరని లోటని పలువురు ప్రముఖులు, నాయకులు పేర్కొన్నారు.
కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పందిరి నాగిరెడ్డి, ఎమ్మెస్ విద్యాసంస్థల సీఈవో ఎస్ఎస్ రావు, ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి చిన్ని మాట్లాడుతూ, శ్రీనివాస కుమార్ ఆకస్మిక మరణం తీరని లోటని అన్నారు. కోదాడలోని పెరిక హాస్టల్ సమీపంలో ఆదివారం శ్రీనివాస కుమార్ పార్థివదేహానికి పందిరి నాగిరెడ్డి, ఎస్ఎస్ రావు, రాయపూడి చిన్ని, జి.ఎల్.ఎన్.రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పందిరి ఫౌండేషన్ సభ్యులు గోపి రాథోడ్ కూడా పాల్గొన్నారు. అనంతరం శ్రీనివాస కుమార్ కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు.












