తెలంగాణ ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 112వ జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. అదనపు ఎస్పీ శ్రీ చేతన్ నితిన్, ఐపీఎస్ గారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ చేతన్ నితిన్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర, ప్రజాసేవ పట్ల ఆయనకున్న నిబద్ధత, సామాజిక సమానత్వం కోసం చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
తెలంగాణ సమాజం కోసం ఆయన చేసిన సేవలు, ప్రజా సమస్యలపై ఆయన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, ఆర్.ఐ. వేణుతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వారు కూడా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘనంగా నివాళులు అర్పించారు.












