సూర్యాపేట జిల్లా మండల కేంద్రంలో కల్లుగీత కార్మికులకు కాటమయ్య కిట్లకు సంబంధించి శిక్షణ తరగతులు నిర్వహించారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, తాటిచెట్లపై ప్రమాదాల నివారణకు ఈ కిట్లు ఎలా ఉపయోగపడతాయో వివరించారు.
కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో, సూర్యాపేట జిల్లా మండల కేంద్రంలో కల్లుగీత కార్మికులకు కాటమయ్య కిట్లకు సంబంధించి శిక్షణ తరగతులు నిర్వహించారు. గౌడన్నలు తాటిచెట్టు ఎక్కినప్పుడు ప్రమాదాలకు గురికాకుండా, చెట్టు నుండి జారి పడకుండా ఉండటానికి కాటమయ్య కిట్లు ఎంతగానో దోహదపడతాయని ఆయన అందరికీ శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ నుండి నరేష్, ఎక్స్చేంజ్ ప్రొఫెషనల్ ఆఫీసు నుండి భవాని పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో గౌడన్నలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.












