ఎస్జీటీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎస్జీటీయూ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి మహేష్‌గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఎస్జీటీయూ శాఖ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి నివాళులర్పించి, సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
ఎస్జీటీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎస్జీటీయూ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి మహేష్‌గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఎస్జీటీయూ శాఖ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎస్జీటీల సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
ప్రధాన డిమాండ్లు
ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ, ఎస్జీటీలకు గుదిబండగా మారిన జీవో నంబర్ 25ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని, ప్రతి పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుడిని కేటాయించాలని కోరారు. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యంలో పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో జిల్లా నాయకులు సందుపట్ల రమేష్, బోగ శ్రీనివాస్, నాంపల్లి హరికృష్ణ, భక్తుల రమేష్, శ్రీనివాస్, శ్రీధర్, సంతోష్, శివ, పవన్‌కుమార్, రాజేష్‌కుమార్, కటకం సంతోష్, అనుమల నరేందర్, సంతోష్, శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


