మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన ఆకావరపు మదనాచారి అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు మృతి చెందారు. ఈ వార్త గ్రామంలో విషాదాన్ని నింపింది.
చెరువుగట్టు మాజీ సర్పంచ్ మల్గా బాలకృష్ణ గారు, మృతుని పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, 5,000 ఆర్థిక సహాయం అందజేశారు.
మనిషి జీవితం శాశ్వతం కాదు. కానీ మనం పంచిన ప్రేమ, చేసిన మంచిపని ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి అని బాలకృష్ణ గారు అన్నారు.
మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ దాసోజు కోటి, చొల్లేటి జ్ఞానేశ్వర్, దాసోజు నరసింహాచారి, దాసోజు హరీష్, మిర్యాల రమేష్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.












