దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో అందించే చికిత్సల ధరలను తప్పనిసరిగా ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్రం లేఖలు రాసింది. ప్రతి చికిత్సకు సంబంధించిన ధరలను ఇంగ్లిష్ తో పాటు స్థానిక భాషలోనూ ప్రదర్శించాలని ఆదేశించింది.

ఈ నిబంధనల అమలు బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్రం స్పష్టం చేసింది. ఆస్పత్రి బిల్లుల విషయంలో రోగులకు తలెత్తే వివాదాలు, ఫిర్యాదులను తగ్గించడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.