మండలం అల్లీపూర్ గ్రామం పోచమ్మ వాడ వద్ద నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వార్డు సభ్యులు అమ్మవారిని దర్శించుకున్నారు. నవదుర్గ సేవా సమితి ఆహ్వానం మేరకు వార్డు సభ్యులందరూ కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం నవదుర్గ సేవా సమితి అధ్యక్షులు అట్కాపురం సంజీవ్ అడ్వకేట్ వార్డు సభ్యులందరికీ నవదుర్గ చిత్రపటాన్ని కానుకగా అందజేశారు. తదనంతరం మహా అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నవదుర్గ సేవా సమితి అధ్యక్షులు అట్కాపురం సంజీవ్, ఉపాధ్యక్షులు అదుర్తి మనోహర్, కోశాధికారి మందుల శీను, ప్రధాన కార్యదర్శి ఎర్రవేణి రవి, కార్యదర్శి గెల్లె రమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గొల్లపల్లి నవీన్, జాయింట్ ట్రెజరర్ అత్తినేని నాగరాజు, ట్రెజరీ ఆదిరెడ్డి, వార్డు సభ్యులు మందుల రాధ, సుతారి రోజా, అట్కాపురం భవాని, అట్కాపురం సంధ్య, అత్తినేని వనిత, అనుమల్ల రాజ్ కుమార్, గంగాధర్, ప్రశాంత్, సాయి, అట్కాపురం గంగశేఖర్, ఉరుమండ్ల సంజీవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.











