సూర్యాపేట జిల్లా మండలం సీతానగరం గ్రామంలో శ్రీ దుర్గ భవాని యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులకు, గ్రామస్థులకు అన్నప్రసాదాన్ని అందజేశారు.
శ్రీ దుర్గ భవాని అమ్మవారి ఆశీస్సులతో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమం సేవాభావానికి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచింది. అన్నదానం మహాదానమనే స్ఫూర్తితో యువత ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
యువత భవిష్యత్ ప్రణాళిక
ఈ సందర్భంగా శ్రీ దుర్గ భవాని యూత్ సభ్యులు మాట్లాడుతూ, భక్తి భావంతో పాటు సేవా కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యతనిస్తూ, గ్రామంలో ఐకమత్యాన్ని పెంపొందించే విధంగా ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులోనూ నిర్వహిస్తామని తెలిపారు.
అన్నదాన కార్యక్రమంలో పాల్గొని సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ ప్రజల సహకారంతో కార్యక్రమం విజయవంతంగా సాగింది.
సేవే లక్ష్యం భక్తే మార్గం.












