జగిత్యాల జిల్లా మండల కేంద్రంలో కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ జరిగింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకం కింద నిధులను త్వరితగతిన అందించాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు దోమకొండ చిన్న రాజన్న, నోముల లక్ష్మ రెడ్డి, ఎలల దశరథ్ రెడ్డి, జిల్లాల పవన్, తహసిల్దార్ వర ప్రసాద్ తో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు.











