ఖమ్మంలోని వర్తక సంఘ భవనంలో జరిగిన 32వ జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో నడిగూడెం గురుకుల పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో పాల్గొన్న 18 మంది విద్యార్థులు మొత్తం 18 పతకాలు సాధించి పాఠశాలకు గుర్తింపు తెచ్చారు.
పోటీల్లో 2 బంగారు, 6 వెండి, 10 కాంస్య పతకాలు సాధించారు. బంగారు పతకాలను ఎస్.కె. జాస్మిన్, జి. త్రివేణి గెలుచుకున్నారు. కె. శశి, ఎన్. రిషిత, పి. కుషిక, డి. సహస్ర, జి. పల్లవి, డి. చరిష్మ వెండి పతకాలు సాధించగా, పి. బ్లెస్సీ, ఎం. మహేమా, ఎన్. ప్రణతీ, ఎన్. పూర్ణ తేజిత, పి. భావన శ్రీ, పి. లక్ష్మీ గౌతమి, ఎం. అఖిల, జి. లక్ష్మీ ప్రసన్న, బి. కీర్తి, ఎన్. అశ్విత కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు.
విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం పట్ల నడిగూడెం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ చింతలపాటి వాణి, సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ విజయ శ్రీ, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ సునీత, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
విద్యార్థులకు కరాటేలో శిక్షణ అందించిన మాస్టర్ కొండపల్లి క్రాంతికుమార్‌ను కూడా అభినందించారు.











