నార్కట్పల్లి, 13 November
నల్గొండ పట్టణ మాజీ కౌన్సిలర్ మాతంగి సత్యనారాయణ మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
నల్గొండ పట్టణ మాజీ కౌన్సిలర్ మాతంగి సత్యనారాయణ మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, మాతంగి సత్యనారాయణ మృతి బాధాకరమని, ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలు, పట్టణ అభివృద్ధికి అందించిన సహకారం స్మరణీయమని అన్నారు.
మాతంగి సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాతంగి సత్యనారాయణ కుటుంబ సభ్యులకు ధైర్యం చేకూరాలని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు.







