బీర్కూర్, 16 November
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని దమరంచ గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతం కోసం మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి సర్పంచ బోయినీ శంకర్ భూమి పూజ చేసి, పనులను ప్రారంభించారు.
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని దమరంచ గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘాల () బలోపేతం కోసం మహిళా సమాఖ్య భవనాల ( ) నిర్మాణానికి సర్పంచ బోయినీ శంకర్ భూమి పూజ చేసి, పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బోయిని శంకర్ మాట్లాడుతూ, మహిళల ఆర్థిక స్వావలంబనకు ఈ భవనాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి, స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవడానికి ఈ భవనాలు ఒక వేదికగా నిలుస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇంటెనక శంకర్ ,మేదరీ లక్ష్మీ నారాయణ, తోట నారాయణ, షేక్ హైమద్, గోపీ, కురుమ బోయిని నారాయణ, కనిగిరి కాశిరామ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సభ్యులు పాల్గొన్నారు.







