నడిగూడెం, 18 November
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు. మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ దున్నా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆమె చేయూత పెన్షన్లను పంపిణీ చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం నందు గ్రామ సర్పంచ్ దున్నా శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన చేయూత పెన్షన్లను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మొక్క బిక్షపతితో కలిసి పంపిణీ చేశారు.
అనంతరం మాట్లాడుతూ తెలంగాణలో వితంతువులకు, ఒంటరి మహిళలకు, గీత కార్మికులకు, వికలాంగులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అర్హులైన ప్రతి పేదవారికి చేయూత పెన్షన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల సహకారంతో నియోజకవర్గం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని, తమ గ్రామాన్ని, మండలాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఉత్తమ్ దంపతులు అత్యధికంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి బాటలు వేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ల ఫోరం మండల కన్వీనర్ బూత్కూరి వెంకటరెడ్డి, పంచాయతీ కార్యదర్శి ఎలకా ఉమారాణి, వార్డు సభ్యులు దున్న శ్రీకాంత్, దున్న లింగయ్య, దున్న మనిషా ప్రదీప్, బాణాల సతీష్ కుమార్, కాసాని సతీష్ శైలజ, గుండు మహేందర్ ప్రసాద్, కాసాని మాధవి గోపీనాథ్, షేక్ నాజియా రియాజ్, నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండు శ్రీనివాస్, పుల్లపు శ్రీనివాస్, పందిరి వెంకటరెడ్డి, చిల్లంచర్ల సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, కాసాని శివలింగం, బాణాల నాగరాజు, గుండు విజయ రామారావు, కత్తి విజయ్, శ్రీరాముల శ్రీనివాస్, జలాలుద్దీన్, పల్లపు గోపాల్, సీపీఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ, టీడీపీ నాయకులు బూరుగడ్డ థామస్, దేవరంగుల వీరన్న, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, వివోలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.







