నార్కట్పల్లి, 2026-11-17
ప్రజాధనం వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని, పాలనలో పారదర్శకత పెరగాలని, ఉద్యోగులు జవాబుదారీగా ఉండాలని వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎర్రమాద కృష్ణారెడ్డి అన్నారు. సమాచార హక్కు చట్టం-2005 పై అవగాహన పెంచుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు.
సమాచార హక్కు చట్టం-2005 గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, వారి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇది ఏకైక మార్గమని, ప్రజాధనం వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎర్రమాద కృష్ణారెడ్డి అన్నారు. సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో తాళ్లపల్లి అరుణ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమాచార హక్కు చట్టం-2005 అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, ప్రజాధనం వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని, పాలనలో పారదర్శకత పెరగాలని, ఉద్యోగులు జవాబుదారీగా ఉండాలని, ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులని అంశాల వారీగా వివరించారు.
సమాచార హక్కు చట్టం-2005 బోర్డును ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ కార్యాలయ విధుల గురించి ప్రజలకు స్వచ్ఛందంగా వెల్లడించాలని నల్లగొండ జిల్లా ఆర్టిఏ మోటరింగ్ కమిటీ సభ్యులు భైరవ సైదులు గౌడ్ అన్నారు. హసన్పర్తి కార్యాలయంలో నిర్వహించిన సమాచార హక్కు చట్టం-2005 పై అవగాహన సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో సమాచార హక్కు వికాస సమితి మహిళా కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు వై. హేమలత, కార్యవర్గ సభ్యులు కొదమూరు కృష్ణమూర్తి, కైతన్ సందీప్, మక్సు సుధీర్ కుమార్ పాల్గొన్నారు.







