కేశంపేట్, 12 September
మండలం బొదునంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ అభ్యర్థి శేఖర్ యాదవ్, మాజీ ఉపసర్పంచ్ లింగారెడ్డి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
*దూసుకెళ్తున కారు పార్టీ....* *బోదునంపల్లి కంటెస్టెడ్ సర్పంచ్ శేఖర్ యాదవ్,మాజీ ఉపసర్పంచ్ లింగారెడ్డి బీఆర్ఎస్ లో చేరిక* *పార్టీ కండువ కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి* మండలం బొదునంపల్లి గ్రామ కంటెస్టెంట్ సర్పంచ్ శేఖర్ యాదవ్ మరియు మాజీ ఉపసర్పంచ్ లింగా రెడ్డి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి షాద్నగర్ కార్యాలయంలో శేఖర్ యాదవ్ మరియు లింగారెడ్డికి పార్టీ కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ షాద్ నగర్ మరియు రాష్ట్రంలో ఎగిరేది బీఆర్ఎస్ జెండానేనని రానున్న రోజుల్లో మరిన్ని చేరికలతో పార్టీ మరింత శక్తివంతంగా మారుతుందని,మళ్ళీ కేసీఆర్ ముఖ్య మంత్రి అవుతారని,కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల కాలంలో జరిగిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తెలిపారు.2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు నుండి కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వారు 2025 సర్పంచ్ ఎన్నికలలో బొదునంపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్తిగా పోటీ చేసిన అశోక్ యాదవ్ 11 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోవడం తో అప్పడి నుండి స్తబ్దుగా ఉన్నారు.ఈ సందర్భంగా శేఖర్ యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కొరకు చేస్తున్న పోరాటాలను మరియు ప్రజలలో వారికి ఉన్న ఆదరణను చూసి ఆకర్షితునై పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు.అతి త్వరలో గ్రామం నుండి భారీ స్థాయిలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు చేయిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు శేఖర్ పంతులు,తాండ్ర విష్షు వర్ధన్ రెడ్డి,యారం శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.











