నార్కట్పల్లి, 2026-11-21
చెర్వుగట్టు గ్రామంలో ఎమ్మెల్యే వేముల వీరేశం లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ ఉత్తర్వులను పంపిణీ చేశారు.
నార్కెట్పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం తరపున నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల ఉత్తర్వులను పంపిణీ చేశారు. నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీ వేముల వీరేశం సహకారంతో రాజకీయాలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులకు ఈరోజు పింఛన్ ఉత్తర్వులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో చెర్వుగట్టు సర్పంచ్ నేతకాని కృష్ణయ్య, దేవస్థాన చైర్మన్ వారాల రమేష్, మాజీ దేవస్థాన చైర్మన్ రేగట్టే రాజశేఖర్ రెడ్డి, వార్డు సభ్యులు రేగట్టే లక్ష్మమ్మ నర్సిరెడ్డి, రేగట్టే ప్రియాంక నరేష్ రెడ్డి, పిట్టల నాగన్న, చీర లింగయ్య, చీర మల్లేష్, దేవర బీరప్ప, వారాల సతీష్, గ్రామ కార్యదర్శి నన్నూరి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.







