జగిత్యాల, 2026-11-28
జగిత్యాల జిల్లా చిన్నమెట్పల్లి గ్రామంలో ఇందిరమ్మ బీమా పథకాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు ఆధ్వర్యంలో ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమని గ్రామ సర్పంచ్ మహమ్మద్ రహీం తెలిపారు.
జగిత్యాల జిల్లా చిన్నమెట్పల్లి గ్రామంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ నిర్వహణలో ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మహమ్మద్ రహీం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ బీమా పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. అర్హులైన గ్రామ ప్రజలందరూ ఈ పథకంలో భాగస్వాములై ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
భవిష్యత్తులో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, పేద కుటుంబాలకు అండగా నిలవడం, మహిళల సంక్షేమం, రైతుల అభివృద్ధి, నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహమ్మద్ రహీం, ఉప సర్పంచ్ వెలుమల మంజుల ఏకంబర్, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పథకం లబ్ధిదారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.







