దండేపల్లి, 3 September
మంచిర్యాల జిల్లా మండల కేంద్రంలో గురువారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వృద్ధాప్యంతో మంచానికే పరిమితమైన 80 ఏళ్ల ఓరగంటి పోషంపై ఐదు వీధి కుక్కలు దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
వీధి కుక్కల దాడిలో వృద్ధుడి మృతి , మంచిర్యాల జిల్లా వీధి కుక్కల దాడిలో 80 ఏళ్ల వృద్ధుడు మృతి చెందిన విషాద ఘటన మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ఓరగంటి పోషం (80) వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో లేవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఐదు వీధి కుక్కలు ఒక్కసారిగా ఆయనపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. కుక్కలు తీవ్రంగా దాడి చేయడంతో పోషం ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మండల కేంద్రంలో వీధి కుక్కల సంచారం పెరిగిపోయిందని, ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.












