నిర్మల్ రూరల్, 3 September
జగిత్యాల మండలం, లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రైతు పన్నాల తిరుపతి రెడ్డి (సింగాపూర్ తిరుపతి రెడ్డి) దేశవాళి ఆవుల పెంపకంలో నష్టాలు వస్తున్నప్పటికీ, గోసేవనే లక్ష్యంగా దాదాపు 100 గిర్, సాహివాల్ వంటి దేశవాళి ఆవులను పెంచుతున్నారు. మూగజీవుల సంరక్షణ తన బాధ్యతగా భావిస్తూ ఆయన ఈ పని చేస్తున్నారు.
గోసేవ అంటే ఇలా ఉండాలి.. మాటల్లో కాదు చేతల్లో చూపించాలి. జగిత్యాల మండలం,లక్ష్మి పూర్ గ్రామానికి చెందిన రైతు పన్నాల తిరుపతి రెడ్డి (సింగాపూర్ తిరుపతి రెడ్డి. దేశవాళి ఆవుల పెంపకంలో నష్టాలు వస్తున్నప్పటికి గోసేవే లక్ష్యంగా దాదాపు 100 గిర్, సాహివాల్ లాంటి దేశవాళి ఆవులను పెంచుతున్నాడు. నష్టం వస్తుంటే ఎందుకు అని దగ్గరి వాళ్ళు, కుటుంబ సభ్యులు చెబుతున్న వినకుండా మూగ జీవల సంరక్షణ తన బాధ్యతగా భావిస్తున్న ఈ గోసేవకున్ని ఎంత పొగిడినా తక్కువే. గోసేవ అంటే మాటల్లో చెప్పడం కాదు.త్యాగం తో, ప్రేమతో చేతల్లో చూపించడం. ఇలాంటి గోసేవకులకు హృదయపూర్వక అభినందనలు 🌹












