గంపలగూడెం, 2026-11-21
గంపలగూడెం మండలం, కనుమూరు గ్రామ పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మండల ఫారెస్ట్ అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి, తహసీల్దార్, సర్కిల్ ఇన్స్పెక్టర్, ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
గంపలగూడెం మండలం, కనుమూరు గ్రామ పరిసరాల్లో పులి సంచారం ఉన్నట్లు సమాచారం. కనుమూరు గ్రామ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో, ఈ రోజు మండల ఫారెస్ట్ అధికారి (), రెవెన్యూ డివిజనల్ అధికారి (), గంపలగూడెం తహసీల్దార్ (), తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్, గంపలగూడెం పోలీస్ స్టేషన్కు చెందిన ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు సంబంధిత ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా పొలాలు, అటవీ ప్రాంతాలు, గ్రామ శివారు ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో బయట తిరగకుండా, పిల్లలను ఒంటరిగా బయటకు పంపకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పులి సంచారానికి సంబంధించిన ఏవైనా ఆనవాళ్లు లేదా సమాచారం కనిపించినట్లయితే, దాని దగ్గరకు వెళ్లడం, వెంబడించడం, ఫోటోలు లేదా వీడియోల కోసం ప్రయత్నించడం చేయకుండా వెంటనే అటవీ శాఖ లేదా పోలీసు అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.
ప్రజల భద్రత దృష్ట్యా సంబంధిత శాఖల అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, ప్రజలు అధికారుల సూచనలను పాటించి అప్రమత్తంగా ఉండాలని కోరారు.







