Khammam/Madhira (ధర్మ రథం) నవంబర్ 28
ఖమ్మం జిల్లా మధిర మండలంలో ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ వాగులో బోల్తా కొట్టింది, దీంతో పంట నీటిలో కొట్టుకుపోయింది.
ఖమ్మం జిల్లా మధిర మండలంలోని ఇల్లూరు గ్రామంలో శనివారం ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ వాగులో బోల్తా పడింది. ట్రాక్టర్ ట్రాలీ పక్కకు ఒరిగిపోవడంతో అందులోని ధాన్యం మొత్తం నీటిలో కొట్టుకుపోయింది.
కష్టపడి పండించిన పంట కళ్ల ముందే నీటిలో కలిసిపోవడంతో రైతు లబోదిబోమంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం డబ్బులు వెచ్చించి బ్రిడ్జి కట్టించినా, ఇంకా ఎన్నాళ్లు ఈ కష్టాలు మాకు తప్పవని గ్రామ ప్రజలు, కూలీలు, రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు వెంటనే స్పందించి మిగిలిన బ్రిడ్జిని నిర్మించాలని, నష్టపోయిన రైతును ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.



