రాయికల్, 10 September
మండలం కట్కాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల మంజూరు ప్రక్రియపై ఎంక్వేరీ జరిగింది. ఎంపీడీవో చిరంజీవి ఇంటింటికి వెళ్లి అసలైన లబ్ధిదారులకు పింఛన్ అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.
మండలం కట్కాపూర్ గ్రామంలో ఎంపీడీవో కార్యాలయం ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల మంజూరు ప్రక్రియపై ఎంక్వేరీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో చిరంజీవి ఇంటింటికి తిరిగి అసలైన లబ్ధిదారులకు పింఛను మంజూరు అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, కట్కాపూర్ సర్పంచ్ పడాల పూర్ణిమ తిరుపతి, వార్డు సభ్యులు రంజిత్ రాజు, అంజి, కార్యదర్శి, లబ్ధిదారులు, కట్కాపూర్ గ్రామస్తులు పాల్గొన్నారు.












