చేశామని (ధర్మ రథం) సెప్టెంబర్ 10
ఎర్రుపాలెం మండలంలో భూ సర్వేను పరిశీలించడానికి వచ్చిన ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్‌ను సీపీఎం పార్టీ బృందం కలిసి, మండలంలో పంటలు ఎండిపోతున్నందున సాగర్ జలాలను విడుదల చేయాలని, అలాగే అక్రమ మట్టి రవాణాను అరికట్టాలని వినతిపత్రం అందించింది.
*కలెక్టర్ ను కలిసిన సిపిఎం పార్టీ బృందం,* *సాగర్ జలాలను విడుదల చేయాలని,* *మట్టి మాఫియా ఆగడాలు అడ్డుకట్ట వేయాలని వినతి పత్రం* , ఎరుపాలెం మండల పరిధిలోని తాటిగూడెం రెవెన్యూ పరిధిలో జరుగుతున్న భూ రీ సర్వే ను *ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ పరిశీలించడానికి వచ్చిన* సందర్భంలో సిపిఎం పార్టీ బృందం కలెక్టర్ ను కలిసి భూ సర్వే గురించి అనేక విషయాలు తెలుసుకున్నారు. మండలoలో గల రైతుల వ్యవసాయ భూములు వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని సాగర్ జలాలను విడుదల చేయాలని వినతిపత్రం అందించారు. మండలంలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ యదేచ్చగా మట్టి మాఫియా రవాణా చేస్తున్నారని అట్టి మట్టి మాఫియా ఆగడాలను అరికట్టాలని కలెక్టర్ ను కోరారు. వీటి పైన స్పందించిన కలెక్టర్ సాగర్ జలాలను రెండవ జోన్ కి నీటిని విడుదల మండలం మూడవ జోన్ లో ఉందని నీటిని విడుదల చేస్తామని చెప్పారని,మట్టి మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని తహసిల్దార్ సునీత ఎలిజిబెత్ ను ఆదేశించినట్లు *సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దివ్వెల వీరయ్య,మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్* తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కూడెల్లి నాగేశ్వరరావు, గౌర్రాజు రాములు, తాళ్లూరు వెంకటనారాయణ వేముల వెంకటేశ్వరరావు, వీరంకి శ్రీను తదితరులు పాల్గొన్నారు.











