ఖమ్మం, 2026-06-05
ఖమ్మం రీజియన్లోని గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో 202627 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన పనిచేయడానికి మహిళా బోధనా సిబ్బంది (గెస్ట్ ఫ్యాకల్టీ) నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తెలిపారు. మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అర్హతలు
అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండటంతో పాటు //..లో ఏదైనా అర్హత కలిగి ఉండాలని సూచించారు.
ఖాళీల వివరాలు
ఇంగ్లీష్ 02, ఫిజిక్స్ 02, గణితం 01, బోటనీ 01, కంప్యూటర్ సైన్స్ 01, కామర్స్ 06, పొలిటికల్ సైన్స్ 01, కెమిస్ట్రీ 02, హిస్టరీ 02 చొప్పున మొత్తం 19 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తుల సమర్పణ
ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను విద్యార్హతల ధ్రువపత్రాల నకళ్లతో జతపరిచి 11-08-2026 ఉదయం 10:00 గంటల నుంచి 13-08-2026 సాయంత్రం 5:00 గంటల వరకు కార్యాలయ పని దినాల్లో నేరుగా సమర్పించవచ్చని తెలిపారు. దరఖాస్తుల సమర్పణ స్థలం: గిరిజన సంక్షేమ గురుకుల బాలికల డిగ్రీ కళాశాల, కొత్తగూడెం కాలేజీ, పాల్వంచ.
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థులు సాధించిన అర్హత మార్కుల ఆధారంగానే ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు పీవో తెలిపారు. అవసరాన్ని బట్టి ప్రకటించిన ఖాళీల సంఖ్యను పెంచడం, తగ్గించడం లేదా ప్రకటనను పూర్తిగా రద్దు చేసే అధికారం ఐటీడీఏ భద్రాచలం ప్రాజెక్టు అధికారికి ఉంటుందని స్పష్టం చేశారు.
మరిన్ని వివరాలకు
మరిన్ని వివరాలకు 9848965711, 7989325024 నంబర్లకు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని ఐటీడీఏ పీవో బి. రాహుల్ తెలిపారు.