హైదరాబాద్, జూలై 8
విద్యార్థుల ఫీజు బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు 'టైగర్' ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్లోని బషీర్బాగ్లో గల జగ్జీవన్ రావ్ విగ్రహం వద్ద బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే గుర్తించాలని ఆయన కోరారు.
విద్యార్థుల ఫీజు బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు 'టైగర్' ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్లోని బషీర్బాగ్లో గల జగ్జీవన్ రావ్ విగ్రహం వద్ద బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ, ఫీజు బకాయిల వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం తక్షణమే గుర్తించాలన్నారు.
విద్యార్థుల విద్యా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని ఆయన కోరారు. అలాగే, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పించాలని, విద్యార్థుల పట్ల నిర్లక్ష్య వైఖరిని వీడి, సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు.
ఈ ర్యాలీలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్ తో పాటు భారీ సంఖ్యలో విద్యార్థులు, సంఘం నాయకులు పాల్గొన్నారు. ఫీజు బకాయిలు విడుదల చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు హెచ్చరించారు.






