Khammam/Madhira (ధర్మ రథం) సెప్టెంబర్ 09
ఖమ్మం జిల్లాలోని తొండలగోపవరం గ్రామంలో జరుగుతున్న భూ రీసర్వే ప్రక్రియను రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ పరిశీలించారు. రైతుల నుంచి రీసర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని భూముల విస్తీర్ణాన్ని కూడా ఆయన సమీక్షించారు.
ఖమ్మం జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ తొండలగోపవరం గ్రామంలో జరుగుతున్న భూ రీసర్వే ప్రక్రియను పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడి, రీసర్వే ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే, రీసర్వేలో రైతు వారీగా నమోదైన విస్తీర్ణాలను పరిశీలించారు. తొండలగోపవరం రెవెన్యూ గ్రామ సరిహద్దును మొత్తం 6.6 కిలోమీటర్లుగా నిర్ణయించారు. గ్రామం మొత్తం విస్తీర్ణం 573.00 ఎకరాలు కాగా, అందులో ప్రభుత్వ సర్వే నంబర్లలోని విస్తీర్ణం 37.00 ఎకరాలు. రోడ్లు, డొంక, కాలువ విస్తీర్ణం పోగా మిగిలిన పట్టా భూముల మొత్తం విస్తీర్ణం 508.00 ఎకరాలుగా గుర్తించారు. ఈ పట్టా భూములను క్లస్టర్ వారీగా విభజించి, సంబంధిత రైతుల సమక్షంలో రీసర్వే చేస్తున్నారు. పట్టా భూములలో ఇప్పటివరకు సుమారు 60.00 ఎకరాల సర్వేను పూర్తి చేశారు.












