మధిర, 11 September
నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కృషి చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఆత్కూర్ నుంచి పిల్లిగుట్ట వరకు జరుగుతున్న మెటల్ రోడ్డు నిర్మాణ పనులను వారు పరిశీలించారు.
*భట్టి విక్రమార్క కృషితో గ్రామీణ రహదారుల అభివృద్ధి – కాంగ్రెస్ నాయకులు* ఆత్కూర్ నుంచి పిల్లిగుట్ట వరకు జరుగుతున్న మెటల్ రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. పనుల పురోగతిని పరిశీలించిన నాయకులు రోడ్డు పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న డిప్యూటీ సీఎం *మల్లు భట్టి విక్రమార్క* గారి కృషి ఫలితంగానే గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాల మెరుగుదలకు పెద్దపీట వేయబడుతోందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా మెరుగైన రహదారులను అందుబాటులోకి తీసుకురావడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *పారుపల్లి విజయ్ కుమార్*, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి *కర్నాటి రామారావు*, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు *తుమాటి నవీన్ రెడ్డి*, కాంగ్రెస్ నాయకులు *రవి*, *గొల్లమందల శీను*, తదితరులు పాల్గొన్నారు.











