ఖమ్మం, 10 September
మహాదేవపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమగ్ర బాలల సంరక్షణ పథకంపై గ్రామ స్థాయి బాలల సంరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాల సద్వినియోగం, బాల్య వివాహాల నివారణ వంటి అంశాలపై అధికారులు చర్చించారు.
ఈ రోజు మహాదేవపురం గ్రామ పంచాయతీ ఆఫీసులో సమగ్ర బాలల సంరక్షణ పథకం గురించి, గ్రామ స్థాయి బాలల సంరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గౌరవ సర్పంచ్ మరియు కమిటీ చైర్మన్ వాసిరెడ్డి నాగేశ్వరావు గారు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. జిల్లా శిశు సంక్షేమ శాఖ సోషల్ వెల్ఫేర్ నుండి హరినాథ్ గారు పాల్గొన్నారు. హరినాథ్ గారు బాలబాలికలను ఉద్దేశించి మాట్లాడుతూ వారికి ఉన్న ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్య, వైద్యం లాంటి ముఖ్యమైన అంశాలు బాలబాలికలకు ఎంత అవసరమో వివరించారు. చిన్న వయసులో పెళ్లిళ్లు చేసి వారి జీవితాలను నాశనం చేయొద్దన్నారు. సర్పంచ్ వాసిరెడ్డి నాగేశ్వరావు గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ హరినాథ్ గారు బాలబాలికలగురించి మాట్లాడిన ముఖ్యమైన అంశాలు చాలా బాగున్నాయని, వాటిని తూచ తప్పకుండ పాటించాలన్నారు. తెలియని విషయాలు ఏమైనా ఉంటే అడిగి తెలుసుకోవాలన్నారు. ZPHS HM సాధుసమాధానం గారు స్కూల్ లో ఉన్నటువంటి ఒక సమస్యను అంటే ఆకతాయి పిల్లలు కొంతమంది, స్కూల్ లో పిల్లలకు పాఠాలు చెప్పే సమయంలో అల్లరి సృష్టించడం, టీచర్ లను లెక్కలేకుండా మాట్లాడటం,సీసీ కెమెరాలకు రాళ్లు విసరడం, స్కూల్లో ఉన్న మంచి వాతావరణాన్ని,చెడకొట్టడం ఈ అంశాలను పోలీస్ వారి దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ జినుగు రాంబాబు గారు , కార్యదర్శి రంజిత్ కుమార్ , Gpo సుధాకర్,అంగన్వాడీ టీచర్స్ హరిబండి ఉష, వాసిరెడ్డి శేషు కుమారి, సోమ కమల, హై స్కూల్ HM సాధు సమాధానం, ఆశ వర్కర్ మర్శకట్ల రాయేలు, గ్రామ దీపిక నల్లపు రవికుమార్, గ్రామ పోలీస్ D శివ, ప్రసాద్, RMP గోంగూర నాగేశ్వరావు, కనపర్తి గోపాలకృష్ణ, బాల, బాలికలు మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.


